30 అత్యాచారాలు, 15 హత్యలు.. మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన ‘సైకో శంకర్

జైశంకర్.. అలియాస్ సైకో శంకర్. ఈ పేరు వింటేనే దక్షిణాది రాష్ట్రాల పోలీసలు ఉలిక్కిపడతారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 30 మంది మహిళలపై అత్యాచారం చేసి 15 మందిని పాశవికంగా హత్య చేసిన కేసుల్లో నిందితుడు సైకో శంకర్. హత్యలు, మానభంగాలతో పాటు అనేక దోపిడీ కేసులు అతడిపై నమోదై ఉన్నాయి. 1977, ఫిబ్రవరి 27న తమిళనాడులోని సేలం జిల్లా కన్నియన్‌పట్టి ప్రాంతంలో శంకర్ జన్మించాడు. యుక్త వయసులో ట్రక్ డ్రైవర్‌గా పనిచేశాడు. లారీలో సరుకులు సరఫరా చేసే నిమిత్తం అతడు అనేక ప్రాంతాలకు తిరిగేవాడు. ఈ క్రమంలో రహదారుల పక్కన ఒంటరిగా కనిపించే మహిళలపై శంకర్ కన్నేసేవాడు. వారికి లిఫ్ట్ ఇచ్చే సాకుతో లారీ ఎక్కించుకుని బలాత్కారం చేసేవాడు. సహకరించిన మహిళలపై కేవలం అత్యాచారం చేసి వదిలేసేశాడు. తీవ్రంగా ప్రతిఘటించిన వారిపై అత్యాచారం తర్వాత కత్తితో గొంతు కోసి చంపేసేవాడు. 2008 నుంచి ప్రారంభమైన అతడి నేర ప్రస్థానం మూడేళ్ల పాటు నిరాటంకంగా కొనసాగింది. 2011లో పోలీసులకు పట్టుబడే వరకు అతడు 30 మంది మహిళలను రేప్ చేసి.. అందులో 15 మందిని చంపేశాడు. సైకో శంకర్ మొత్తం 19 మందిని చంపినట్లు ఆరోపణలున్నా.. 15 హత్యలకు సంబంధించే పోలీసులు ఆధారాలు సేకరించగలిగారు.2008లో గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసి చంపేసిన సైకో శంకర్.. 2009, జులై 3న కర్ణాటకలోని పెరందహళ్లిలో శ్యామల(45) అనే మహిళ అతి కిరాతకంగా చంపేశాడు. ఆ ఒక్క ఏడాదిలోనే 12 మందిపై అఘాయిత్యానికి పాల్పడి ప్రాణాలు తీశాడు. శంకర్ వద్ద ఎప్పుడూ ఓ హ్యాండ్ బ్యాగ్ ఉండేది. మహిళలపై అత్యాచారం చేసిన తర్వాత బ్యాగ్‌లో దాచిన ప్రత్యేకమైన కత్తితో బాధితులను పొడిచి చంపేసేశాడు. జాతీయ రహదారి పక్కన ఉండే దాబాల్లో వేచి ఉండే సెక్స్‌‌వర్కర్లతో బేరం మాట్లాడుకుని లారీలో ఎక్కించుకునేవాడు. కాస్త దూరం వెళ్లాక వారితో కోరికలు తీర్చుకుని డబ్బులు ఇవ్వకుండా ప్రాణం తీసేవాడు. వారి శవాలను ఎవరూ గుర్తుపట్టకుండా అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టేవాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలను శంకర్ టార్గెట్ చేసుకునేవాడు