క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఆత్మహత్య

భారత్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది.ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య దేశంలో11వేలు దాటేశాయి. మరణాలు కూడా 400కు చేరువలో ఉన్నాయి. దీంతో సర్వత్రా ఈ వైరస్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు ఈ వైరస్ లక్షణాలతో లేనిపోని అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. వైరస్ తమకు సోకిందన్న భయంతో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా బీహార్‌లో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుంది.క్వారంటైన్‌ కేంద్రానికి వచ్చినప్పుడే తనకు టీబీ ఉందని చాలా ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. వైద్యులు అతనికి అవసరమైన ఆహారం, మందులు ఇచ్చారని చెప్పారు. ఈ నెల 11న ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో హోం క్వారంటైన్‌లో ఉన్న 21 ఏళ్ల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వైరస్ భయంతోనే కొందరు ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారని వైద్య అధికారులు చెబుతున్నారు. అవసరమైన చికిత్స అందిస్తే... కరోనా నుంచి క్షేమంగా బయటపడొచ్చని ధైర్యం ఇస్తున్నారు